రిపబ్లిక్ పరేడ్‌లో తొలిసారి బంగ్లాదేశ్ సైనికుల కవాతు

న్యూఢిల్లీ: జనవరి 26న జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో తొలిసారి బంగ్లాదేశ్ సైనిక దళాలు కవాతులో పాల్గొననున్నాయి. ఆ దేశ త్రివిధ దళాలకు చెందిన 122 మంది జవాన్లు ఢిల్లీకి రావడంతోపాటు రిహార్సిల్స్ కూడా చేశారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తికి భారత్ సహకరించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 50వ స్వాతంత్ర దినోత్సవంతోపాటు ఆ దేశ జాతిపిత బంగబందు షేక్ ముజిబూర్ రెహ్మాన్ శత జయంతిని బంగ్లాదేశ్ జరుపుకుంటున్నది.
దీంతో భారత్‌కు కృతజ్ఞతగా తొలిసారి బంగ్లాదేశ్ సైనిక దళాలు కూడా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటున్నాయి. 1971 నాటి యుద్ధంలో పాల్గొన్న బంగ్లా మిలిటరీకి చెందిన వ్యక్తులు ఈ పరేడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగా, రిపబ్లిక్ డే పరేడ్‌లో విదేశీ సైనిక దళాలు పాల్గొనడం ఇది మూడోసారి. 2016లో ఫ్రాన్స్ సైన్యం, 2017లో యూఏఈకి చెందిన దళాలు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి