శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 08:56:05

చైనా నుంచి భారీగా త‌గ్గిన దిగుమ‌తులు: కేంద్ర మంత్రి గోయ‌ల్‌

చైనా నుంచి భారీగా త‌గ్గిన దిగుమ‌తులు: కేంద్ర మంత్రి గోయ‌ల్‌

న్యూఢిల్లీ: ‌క‌రోనా ప్ర‌భావం, ఆంక్షాల నేప‌థ్యంలో చైనా నుంచి భార‌త్‌కు దిగుమతులు భారీగా తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై మ‌ధ్య‌కాలంలో చైనా నుంచి దిగుమతుల వ్యాపారం 16.60 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్ర‌క‌టించారు. గతేడాది ఇదే సమయంలో దిగుమతులు23.45 బిలియన్ డాలర్లుగా ఉన్నాయ‌ని తెలిపారు. రాజ్య‌స‌భ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఈమేర‌కు రాతపూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు.  

ఆత్మనిర్భ‌ర్ భారత్‌, మేక్ ఇన్ ఇండియాను విజయవంతం చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఆత్మనిర్భార్ ప్యాకేజీ కింద రూ. 20 లక్షల కోట్లను కేంద్రం విడుదల చేసింద‌న్నారు. 


logo