గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 00:15:02

ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి

ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి

-వలస ప్రజలు ప్రయాణాల్ని మానుకోండి

-ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మోదీ వలస ప్రజలకు పలు విజ్ఞప్తులు చేశారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు అక్కడే ఉండాలని.. స్వస్థలాలకు రావడానికి రైలు, బస్సుల్లో ప్రయాణాలు చేయొద్దని సూచించారు. సార్క్‌ దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘కొవిడ్‌-19 అత్యవసర నిధి’కి విరాళాల్ని ఇచ్చిన మాల్దీవులు, భూటాన్‌, నేపాల్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కట్టడికి తమిళనాడు చేపడుతున్న చర్యలను ప్రధాని మెచ్చుకున్నారు. కరోనా నేపథ్యంలో అత్యవసరమైన ఔషధాలు, వైద్య సామగ్రికి కొరత ఉండకుండా.. దేశంలోనే వాటి తయారీని పెంచడానికి 14వేల కోట్లను కేటాయించినట్టు మోదీ తెలిపారు. కరోనా కోసం ఆర్‌ఎన్‌ఏ డయాగ్నోస్టిక్స్‌ కిట్లను తయారు చేయాల్సిందిగా పారిశ్రామిక దిగ్గజాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.  


logo
>>>>>>