మంగళవారం 07 జూలై 2020
National - Jun 05, 2020 , 18:24:05

జీతాలు నిలివేయండి.. పాక్‌కు ఐఎంఎఫ్‌ హుకుం

జీతాలు నిలివేయండి.. పాక్‌కు ఐఎంఎఫ్‌ హుకుం

ఇస్లామాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు స్తంభించాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కోరింది. ఆర్థిక పునరేకీకరణకు కట్టుబడాలని, కొత్త బడ్జెట్‌లో సాధారణ ప్రాధమిక లోటు గురించి పేర్కోవాలని సూచించింది. కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అలాగే గత ఐదేండ్లుగా ఆ దేశం అప్పుల సంక్షోభాలతో సతమతమవుతున్నది.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ప్రజా రుణాలకు తోడు జీ20 దేశాల నుంచి రుణ సహాయాన్ని కోరాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది. జూన్‌ 12న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది. ఈ  నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేయాలని ఐఎంఎఫ్‌ పేర్కొన్నట్లు ఆ దేశ వర్గాలు తెలిపాయి.

అయితే అధిక ద్రవ్యోల్బణం వల్ల ఇప్పటికే ప్రజల ఆదాయం హరించుకుపోవడంతో ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తున్నదని వెల్లడించాయి. మరోవైపు గత ఏడాదిగా ఖాళీగా ఉన్న సుమారు 67 వేల ఉద్యోగాలను భర్తీ చేయకూడదని, ఖర్చులు మరింతగా తగ్గించడంతోపాటు, వాహనాల కొనుగోలును బ్యాన్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. logo