మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 17:47:58

రాగ‌ల 12 గంట‌ల్లో దేశంలో వ‌రుణ బీభ‌త్సం!

రాగ‌ల 12 గంట‌ల్లో దేశంలో వ‌రుణ బీభ‌త్సం!

న్యూఢిల్లీ: ‌దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాగ‌ల 12 గంట‌ల‌పాటు వ‌రుణుడి బీభ‌త్సం కొన‌సాగుతుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. వివిధ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపుల‌తోపాటు ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ సంద‌ర్భంగా ప‌లుచోట్ల పిడుగులు ప‌డే అవ‌కాశం ఉన్న‌ద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. ముఖ్యంగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని తెలిపారు.

అదేవిధంగా సెప్టెంబ‌ర్ 19, 20 తేదీల్లో అండ‌మాన్ నికోబార్ దీవుల్లో, సెప్టెంబ‌ర్ 19 నుంచి 21 వ‌ర‌కు ఒడిశా, కోస్తాంధ్రా, తెలంగాణ‌లో, సెప్టెంబ‌ర్ 21 నుంచి 23 వ‌ర‌కు ప‌శ్చిమ‌బెంగాల్‌లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని భారత వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల్లో అక్క‌డ‌క్క‌డ భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. సెప్టెంబ‌ర్ 22న అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, అసోం, మేఘాల‌యా రాష్ట్రాల్లో, సెప్టెంబ‌ర్ 22, 23 తేదీల్లో సిక్కింలో అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొన్న‌ది.       

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo