గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 22:26:16

ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన : ఐఎండీ

ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన : ఐఎండీ

గువహటి : రాబోయే రెండు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వరదలతో అస్సాం అతలాకుతలమైంది. 85 మంది వరకు మృత్యువాతపడ్డారు. ఇంతకు ముందు కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగి పడి 26 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 111కి చేరింది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) ప్రకారం.. రాష్ట్రంలో 33 జిల్లాలుండగా 24 జిల్లాలో 2,254 గ్రామాల్లో 24.3లక్షలకుపైగా జనం వరదలకు ప్రభావితమయ్యారు. 1.09 లక్షల హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. 18 జిల్లాల్లోని 468 సహాయ శిబిరాల్లో మొత్తం 48,197 తలదాచుకుంటున్నారని విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. బ్రహ్మపుత్ర, ధన్సిరి, కోపిలి, బేకి, కుషియారా, జియా భరాలిలాంటి ప్రధాన నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహించాయి.

కజిరంగ నేషనల్‌ పార్కులో 11 ఖడ్గమృగాలు సహా 133 జంతువులు వరదల్లో మునిగి, వాహనాలు ఢీకొట్టడంతో మృతి చెందాయి. పార్కు పక్కన జాతీయ రహదారి ఉండడంతో వాహనాలు జంతువులను ఢీకొడుతున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరగ్గా, ఐడీఎం హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తుంది. సముద్ర మట్టంలో సగటు రుతుపవనాలు అమృత్‌సర్‌, లుధియానా, మీరట్‌, బరేలీ, గొరఖ్‌పూర్‌, భాగల్పూర్, తూర్పు చివర గుండా హిమాలయాల పర్వత ప్రాంతాలకు దగ్గరగా ఉన్నాయి. దీనికి తోడు ఈశాన్యం మీదుగా బెంగాల్ బే నుంచి తేమతో కూడిన ఆగ్నేయ, దక్షిణ-పశ్చిమ గాలుల కలయిక తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో జరుగుతోంది. దీంతో ఈ నెల 20 నుంచి 22 మధ్య ఈశాన్యంలో భారీ వర్షపాతం నమోదు కానుందని, అస్సాం, మేఘాలయల, అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభావం ఉంటుందని  గుహవాటి ప్రాంతీయ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సునిత్‌ దాస్‌ పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo