మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 09:47:44

నేడు ఢిల్లీ, హర్యానాల్లో వ‌ర్షాలు: ఐఎండీ

నేడు ఢిల్లీ, హర్యానాల్లో వ‌ర్షాలు: ఐఎండీ

న్యూఢిల్లీ: నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ఉత్త‌రాది రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. మంగ‌ళ‌వారం కూడా నైరుతి ఢిల్లీ, ద‌క్షిణ ఢిల్లీ ప్రాంతాల‌తో పాటు హ‌ర్యానాలోని ఝ‌జ్జ‌ర్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌త్రాస్ జిల్లాలు వాటి ప‌రిస‌ర ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ప‌డుతాయ‌ని తెలిపింది. కాగా సోమ‌వారం సాయంత్రం కూడా ఢిల్లీలో భారీ వ‌ర్షం కురిసింది. విజ‌య్ చౌక్, ఇండియా గేట్ ప్రాంతాలు పూర్తిగా జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.                                                                                                                                                                                      


logo