గురువారం 26 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 02:40:09

మలేరియా వ్యాప్తిపై ఐఎండీ అంచనాలు

మలేరియా వ్యాప్తిపై ఐఎండీ అంచనాలు

న్యూఢిల్లీ: వచ్చే వర్షకాలం నుంచి భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మలేరియా వ్యాప్తిపైన కూడా అంచనాలను వెలువరించనున్నది. ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రాజీవన్‌ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ‘ఆధునిక పద్ధతుల్లో వాతావరణ అంచనాలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. వాతావరణ అంచనాలను మరింత కచ్చితంగా వెలువరించేందుకు కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని 10 పెటాఫ్లాప్స్‌ నుంచి 40 పెటా ఫ్లాప్‌లకు పెంచాలని యోచిస్తున్నట్టు చెప్పారు.