మంగళవారం 19 జనవరి 2021
National - Jan 05, 2021 , 14:56:58

రాజీనామాకు సిద్ధమన్న కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

రాజీనామాకు సిద్ధమన్న కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ముంబై: రాజీనామాకు కూడా సిద్ధమేనని మహారాష్ట్ర మంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరత్‌ అన్నారు. తన ఢిల్లీ పర్యటనకు, మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడి మార్పునకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఎన్నో పదవీ బాధ్యతలు చూస్తున్నానని, ఈ నేపథ్యంలో ఇలాంటి ఊహాగానాలు వస్తుంటాయని చెప్పారు. ఒకవేళ తనకన్నా సమర్థవంతంగా పార్టీ కోసం పని చేసే వ్యక్తి ఉంటే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమేనన్న విషయాన్ని పార్టీకి కూడా చెప్పానని బాలాసాహెచ్‌ అన్నారు. ఆయన ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.