గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 19:59:21

‘నేను ఆరోగ్యంగా ఉన్నా’ : సీఎం చౌహాన్‌

‘నేను ఆరోగ్యంగా ఉన్నా’ :  సీఎం చౌహాన్‌

భోపాల్‌ : తాను ఆరోగ్యంగా ఉన్నానని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన అనంతరం ఆయన భోపాల్‌లోని కొవిడ్‌ ఫెసిలిటీలో పరీక్షలు నిర్వహించిన అనంతరం ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు చికిత్స కోసం చిరాయు దవాఖానలో చేరబోతున్నట్లు చెప్పారు. దవాఖాన నుంచే పని చేయడం కొనసాగిస్తానని తెలిపారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, భద్రత కోసం ప్రజలంతా కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటించాలని కోరారు. కరోనాను నివారించడానికి అన్ని విధాలా కృషి చేశానని, కానీ ప్రజలు వివిధ సమస్యలపై నన్ను కలిసేశారని వరుస ట్వీట్లు చేశారు. మార్చి 25 నుంచి ప్రతి సాయంత్రం కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షిస్తున్నానని చౌహాన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం  సాధ్యమైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


తాజావార్తలు


logo