మంగళవారం 31 మార్చి 2020
National - Feb 19, 2020 , 02:40:46

కశ్మీర్‌లో ఆర్థిక, మానసిక సంక్షోభం!

కశ్మీర్‌లో ఆర్థిక, మానసిక సంక్షోభం!
  • మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ఆందోళన

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన అనంతరం ఈ ఏడు నెలల కాలంలో జమ్ముకశ్మీర్‌లో ‘ఆర్థిక, మానసిక, భావోద్వేగ’ సంక్షోభం నెలకొన్నదని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఆర్టికల్‌ 370 అనేది తక్కిన భారతదేశంతో జమ్ముకశ్మీర్‌కు ఉన్న ‘భావోద్వేగ సంబంధం’ అని, దాన్ని తెంచేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. మంగళవారం ఇల్తిజా మీడియాతో మాట్లాడారు. కశ్మీరీల పరిస్థితులపై మోదీ సర్కారు దుష్ప్రచారం చేస్తున్నదని ఆమె ఆరోపించారు. కశ్మీర్‌లో పర్యటించే విదేశీ ప్రతినిధులకు, తక్కిన భారత ప్రజలకు తాము సమాన హక్కులను అనుభవిస్తున్నామని చెప్తున్నారని, కానీ ప్రస్తుతం కశ్మీర్‌లో వీపీఎన్‌ (వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్స్‌) వాడే పరిస్థితి కూడా లేదన్నారు. 1989లో కశ్మీరీ పండిట్లు లోయను విడిచి వెళ్లడంపై ఆమె స్పందిస్తూ.. అది అత్యంత బాధాకరమైన ఘటన అని చెప్పారు. నాటి ఘటనపై బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానన్నారు. ‘హిందూ పాకిస్థాన్‌' దిశగా భారత్‌ పయనిస్తున్నదని ఆమె పేర్కొన్నారు.


logo
>>>>>>