ఆదివారం 07 జూన్ 2020
National - Apr 03, 2020 , 16:35:55

‘నేను లైట్లు బంద్‌చేయను.. కొవ్వొత్తులు వెలిగించను’

‘నేను లైట్లు బంద్‌చేయను.. కొవ్వొత్తులు వెలిగించను’

హైదరాబాద్‌: ఈ నెల 5న దేశవ్యాప్తంగా ప్రజలు లైట్లు ఆఫ్‌ చేసి, కొవ్వత్తులు వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును తాను వ్యతిరేకిస్తున్నాని, దాన్ని పాటించనని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి అన్నారు. అసలు కరోనాపై పోరుకు, లైట్లు బంద్‌ చేసి క్యాండిళ్లు, టార్చ్‌లు వెలిగించడానికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన ట్వీట్‌ చేశారు. ‘నేను లైట్లు బంద్‌ చేయను, క్యాండిళ్లు వెలిగించను, కానీ కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. అలా చేస్తే తనపై జాతివ్యతిరేఖి అనే ముద్ర వేస్తారని, దానికి నేను సిద్ధంగా ఉన్నా’నని పేర్కొన్నారు.


logo