బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 14:11:41

క‌రోనా ప‌రిశోధన‌ల‌లో ఐఐటీలు !

క‌రోనా ప‌రిశోధన‌ల‌లో ఐఐటీలు !

క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచం అంతా వ‌ణికిపోతుంది. దేశంలో రోజురోజుకు క‌రోనా తీవ్ర‌త పెర‌గుతుంది. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లను కాపాడాల్సిన బాధ్య‌త వైద్యుల‌పై, ప‌రిశోధ‌కుల‌పై ఉంది. కరోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ర‌క‌ర‌కాల ప‌రిక‌రాలు, శాటిటైజ‌ర్ల‌ను, ఇత‌రత్రా ప‌రిశోధ‌న‌ల‌ను దేశంలోని ఐఐటీలు నిర్వ‌హిస్తున్నాయి. ఇప్ప‌టికే ఐఐటీ గువాహ‌టిలో బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్ బృందం వైర‌స్‌పై ప‌రిశోధ‌న‌లు తీవ్ర‌త‌రంగా చేసింది. ఇక హైద‌రాబాద్‌లోని ఐఐటీ శానిటైజ‌ర్ల‌ను త‌యారుచేయ‌డ‌మే కాకుండా క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు వ్యాక్సిన్ త‌యారుచేసే ప‌నిలో నిమగ్న‌మైంది. ఇక ఢిల్లీలోని ఐఐటీ క‌రోనా టెస్ట్‌ల‌ను చేయ‌డానికి సంబంధించిన కిట్‌ల‌ను రూపొందించింది. త‌క్కువ ధ‌ర‌లో క‌రోనా వైర‌స్ నిర్ధ‌రాణ‌కు ఈ కిట్‌లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఇదే బాట‌లో ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప‌రిశోధ‌కులు పోర్ట‌బులిటీ వెంటిలేటర్ల‌ను త‌యారుచేసింది. ఇలా దేశంలోని ప‌లు ఐఐటీలు క‌ష్ట‌స‌మ‌యంలో క‌రోనాపై ప‌రిశోధ‌న‌లు చేసి ఫ‌లితాల‌ను సాధిస్తున్నాయి. 

ఏ ఉద్దేశంతో అయితే దేశంలో ఐఐటీల‌ను స్థాపించారో ఆ ఉద్దేశం నెర‌వేరేలా ఆ సంస్థ‌లు త‌మ‌వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించ‌డం సంతోషించ‌ద‌గ్గ ప‌రిణామం. ఇప్ప‌టికే ప్ర‌పంచానికి ప‌లువురు మేధావుల‌ను అందించిన ఐఐటీలు సామాన్యుడికి ఉప‌యోగ‌ప‌డే ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్రాధాన్య‌మివ్వ‌డం ముదావ‌హం. 


logo