బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 15, 2020 , 11:40:31

జై క‌రోనా అంటూ ఐఐటీ విద్యార్ధుల నినాదాలు

జై క‌రోనా అంటూ ఐఐటీ విద్యార్ధుల నినాదాలు

కంటికి క‌నిపించ‌ని నోవ‌ల్ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గడ‌గ‌డ‌లాడిస్తుంది. క‌రోనా కార‌ణంగా జ‌న‌జీవ‌నం స్తంభించే ప‌రిస్థితి వ‌చ్చింది. ముందు జాగ్ర‌త్తగా కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు హై అల‌ర్ట్ ప్ర‌క‌టిస్తూ జ‌న‌సాంద్ర‌త ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌పై ఎక్కువగా దృష్టి సారిస్తుంది. ఈ నేప‌థ్యంలో స్కూళ్ళు, థియేట‌ర్స్‌, కళాశాల‌లు, మాల్స్ అన్ని బంద్ చేయాల‌ని ఆదేశాలు కూడా జారీ చేసింది. క‌రోనా భ‌యంతో ప్ర‌పంచం ఇంత‌గా వ‌ణికిపోతుంటే ఢిల్లీకి చెందిన ఐఐటీ స్టూడెంట్స్ మాత్రం జై క‌రోనా.. జై క‌రోనా అంటూ నినాదాలు చేస్తున్నారు.

క‌రోనా కార‌ణండా ఢిల్లీలోని ఐఐటీ క‌ళాశాల‌లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌లని కొద్ది రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో హాస్టల్‌ విద్యార్దులు ఆ క్ష‌ణాన్ని ఎంజాయ్ చేశారు. జై క‌రోనా అంటూ నినాదాలు చేయ‌డ‌మే కాక డ్యాన్స్‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్స్ ఘాటుగానే స్పందిస్తున్నారు. పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరితే ఇలానే ప్ర‌వ‌ర్తిస్తార‌ని కొంద‌రు నెటిజ‌న్స్ అంటున్నారు. తెలంగాణ‌లోను మార్చి 31 వ‌ర‌కు విద్యా సంస్థ‌లు, థియేట‌ర్స్ మూత‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే.


logo
>>>>>>