డోంట్ కేర్ కరోనా.. పెరిగిన ఐఐటీ ఆఫర్లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా.. ఐఐటీల్లో తొలిదశ క్యాంపస్ సెలక్షన్లపై ఎటువంటి ప్రభావం పడలేదు. ఐఐటీయన్లకు ప్రత్యేకించి ఆసియా దేశాల కంపెనీలు భారీ ఆఫర్లు ఇచ్చాయి. వర్చువల్ ప్లేస్మెంట్ల ద్వారా నియామకాలు జరుపుకున్నాయి. తొలి 10 రోజుల్లో ఐఐటీ మద్రాస్‌లో 753కి పైగా నియామకాలు జరిగాయి. గతేడాది ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-కాన్పూర్ లలో ఇంటర్నేషల్ ఆఫర్లు 19 మందికి మాత్రమే లబించగా, ఈ ఏడాది 23 మంది విద్యార్థులు ఆఫర్లు పొందారని కాన్ఫూర్ ఐఐటీ చైర్మన్ తెలిపారు. ఐఐటీ -రూర్కే నుంచి ఆసియా దేశాల కంపెనీలు నియామకాలు చేపడితే, ఐఐటీ-హైదరాబాద్‌లో ఎక్కువగా జపాన్, తైవాన్ కంపెనీల ఆఫర్లు వచ్చాయి.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కొత్తగా 56కి పైగా సంస్థలు తొలిసారి ఐఐటీ కాన్ఫూర్, ఐఐటీ- మద్రాస్‌ల్లో క్యాంపస్ నియామకాల్లో పాల్గొన్నాయి. వీటిల్లో అత్యధికం సాఫ్ట్ వేర్‌కు చెందిన స్టార్టప్ సంస్థలే ఉన్నాయి. రెండోదశ ప్లేస్మెంట్లలో విద్యాసంస్థలు కూడా క్యాంపస్ సెలక్షన్లలో పాల్గొంటాయని భావిస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ సీఎస్ శంకర్ రామ్ చెప్పారు.
మైక్రోసాఫ్ట్, టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్, బజాజ్ ఆటో, ఇస్రో తదితర అతిపెద్ద సంస్థలు క్యాంపస్ సెలక్షన్లలో భాగమయ్యాయి. ఐఐటీ ఢిల్లీ నుంచి 23 మంది, ఐఐటీ బాంబే నుంచి 21 మందితోపాటు మొత్తం 69 మందిని నియమించుకున్నామని టాటా ప్రాజెక్ట్స్ పేర్కొంది. ఐఐటీయన్లకు వేతన ప్యాకేజీ ఆఫర్లు కూడా సగటున మెరుగయ్యాయి. ఐఐటీ రూర్కే విద్యార్థులు గతేడాదిలో రూ. 62.28 లక్షల ప్యాకేజీ పొందితే, ఈ ఏడాది రూ.80 లక్షల ప్యాకేజీ ఆఫర్ అందుకున్నారు. ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు గతేడాది రూ.62 లక్షల ఆఫర్ అందుకుంటే, ఈ ఏడాది రూ. 82 లక్షల వేతన ప్యాకేజీ ఆఫర్ పొందారు. అంతర్జాతీయ కంపెనీల నుంచి వచ్చిన ఆఫర్లు గతేడాది మాదిరిగానే కొనసాగాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- హిమాచల్ పంచాయతీ పోల్స్.. ఓటేసిన 103 ఏళ్ల వృద్ధుడు
- షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!
- 7,000mAh బ్యాటరీతో వస్తున్న శాంసంగ్ కొత్త ఫోన్..!
- 26న లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీలో ర్యాలీ: పంజాబ్ రైతులు
- అయోధ్య గుడికి రూ.100 కోట్ల విరాళాలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
- కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్‌లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!