గురువారం 03 డిసెంబర్ 2020
National - Aug 19, 2020 , 22:58:08

కరోనా కట్టడి కోసం “మెడికాబ్”

 కరోనా కట్టడి కోసం “మెడికాబ్”

చెన్నై : కోవిడ్‌-19 రోగుల అన్వేషణ, నిర్వహణ-చికిత్స కోసం కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తిగల సంస్థ శ్రీ చిత్ర తిరుణాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIMST), ఐఐటీ-మద్రాస్ ప్రోత్సాహంతో ఏర్పాటైన అంకుర సంస్థ ‘మాడ్యులస్ హౌసింగ్’ ఒక సంచార సదుపాయాన్ని రూపొందించింది. “మెడికాబ్”గా పిలిచే ఈ సంచార సూక్ష్మ నిర్మాణం సదుపాయాన్ని ఎక్కడైనా అమర్చే వీలుం టుంది. అంతేకాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసుకోవచ్చు. నాలుగు మడతలుగా తీసుకెళ్లగలిగే ఈ ‘మెడికాబ్‌’లో డాక్టర్ గది, ఏకాంత చికిత్స గది, ఒక వైద్య గది/వార్డు, జంట-పడకల ఐసీయూలను నిర్వహించవచ్చు. దీన్ని ఏ ప్రదేశంలోనైనా కేవలం రెండు గంటల్లో నలుగురు వ్యక్తుల సహాయంతో అమర్చుకోవచ్చు.