సోమవారం 30 మార్చి 2020
National - Mar 25, 2020 , 17:56:15

క‌రోనా పై 12 భాష‌ల్లో వీడియోలు చేసిన ఐఐటీ విద్యార్థులు !

క‌రోనా పై 12 భాష‌ల్లో వీడియోలు చేసిన ఐఐటీ విద్యార్థులు !

కోవిడ్‌-19పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఐఐటీ విద్యార్థులు 12 భాష‌ల్లో వీడియోలుగా రూపొందించారు. వివ‌రాల‌లోకి వెళితే ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ విద్య‌ర్థులు డ‌బ్ల్యూహెచ్‌వో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సామాన్యుల‌కు సైతం అర్థం అయ్యేలా వీడియోలు రూపొందించి అప్‌లోడ్ చేస్తున్నారు. అస్సామీ, బెంగాలీ, గుజ‌రాతీ, హిందీ, క‌న్న‌డ‌, క‌శ్మీరి, మ‌ళ‌యాలం, మ‌రాఠీ, తెలుగు, ఒరియా, పంజాబీ, త‌మిళం భాష‌ల్లో వీటిని విడుదల చేయ‌నున్నారరు. ఈ వీడియోల‌ను ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఎన్విరాన్‌మెంట‌ల్ యాక్టివిటీకి చెందిన విజ‌న్ ప్ర‌భు స్టూడెంట్ గ్రూప్ రూపొందించింది. 

ప్రాంతీయ భాష‌ల్లో రూపొందించిన వీడియోల వ‌ల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల‌లో ప్ర‌జ‌ల‌కు క‌రోనా పై అవ‌గాహ‌న తొంద‌ర‌గా వ‌స్తుంద‌ని గ్రూప్ స‌భ్యుడు విశ్వ‌రూప్ మండ‌ల్ పేర్కొన్నారు. మొద‌ట బెంగాలీలో ఈ వీడియోను విడుద‌ల చేశారు. రెండుమూడు రోజుల్లో మిగిలిన భాష‌ల్లో వీడియోల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మండ‌ల్ వెల్ల‌డించారు. 


logo