శనివారం 30 మే 2020
National - Mar 30, 2020 , 01:04:50

ఐఐటీ ఖరగ్‌పూర్‌ ‘ఫేస్‌ షీల్డ్‌'

ఐఐటీ ఖరగ్‌పూర్‌ ‘ఫేస్‌ షీల్డ్‌'

-ఆరోగ్య కార్యకర్తల కోసం రూపకల్పన

కోల్‌కతా: మహమ్మారి కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల ఆరోగ్యంపై ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు దృష్టిసారించారు. ఎల్లవేళలా కొవిడ్‌-19 రోగులను అంటిపెట్టుకొని సేవలందిస్తున్నవారికి కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు ఫేస్‌ షీల్డ్‌ను రూపొందించారు. ప్రొఫెసర్‌ సంతను ధారా, ప్రొఫెసర్‌ సంగీతాదాస్‌ భట్టాచార్యతో కలిసి ఇంటిలోనే ఫేస్‌ షీల్డ్‌ నమూనాకు రూపకల్పన చేశారు. ట్రాన్స్‌పరెన్సీ షీట్‌, స్పాంజ్‌, మడతల కాగి తం, కార్డ్‌బోర్డు, రబ్బర్‌బ్యాండ్‌, డబుల్‌సైడ్‌ టేప్‌.. ఇలా ఇంట్లో దొరికే వస్తువులతో విజయవంతంగా ఫేస్‌ షీల్డ్‌ను రూపొందించారు. మరోవైపు మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ సైతం ప్రత్యేక ఫేస్‌ షీల్డ్‌లను తయారుచేయనున్నది. సోమవారం నుంచి వీటి తయారీని ప్రారంభిస్తున్నామని, రోజుకు 500 యూనిట్లు ఉత్పత్తి చేస్తామని మహీం ద్రా అండ్‌ మహీంద్రా సంస్థ ఎండీ పవన్‌ గోయెంకా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. logo