శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 08:37:24

మ‌రికొద్దిసేప‌ట్లో జేఈఈ అడ్వాన్స్‌డ్-2020‌

మ‌రికొద్దిసేప‌ట్లో జేఈఈ అడ్వాన్స్‌డ్-2020‌

హైద‌రాబాద్‌: ఐఐటీల్లో వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్షలు ప్రారంభయ్యాయి. దేశ‌వ్యాప్తంగా  ఈ ప‌రీక్ష కోసం 1,60,831 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుమారు 30 వేల మంది విద్యార్థులు ఈ ప‌రీక్షల‌కు హాజ‌ర‌వుతున్నారు. రాష్ట్రంలో 15 ప‌ట్ట‌ణాల్లో ఆన్‌లైన్ ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటుచేశారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్‌-1, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌రకు పేప‌ర్-2 ప‌రీక్ష ఉంటుంది.

దేశ‌వ్యాప్తంగా 222 ప‌ట్ట‌ణాల్లో 1000 ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. క‌రోనా నేప‌థ్యంలో ప‌రీక్షా కేంద్రాలు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశారు. మాస్క్‌, శానిటైర్ ఉన్న‌విద్యార్థుల‌ను నిర్వాల‌కు ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తిస్తున్నారు.  వ‌చ్చే నెల 5న ఫ‌లితాలు విడుద‌ల‌వుతాయి. జోసా కౌన్సెలింగ్ (సీట్ల కేటాయింపు) వ‌చ్చే నెల 6 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. 


logo