బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 00:38:52

‘ఫావిపిరవిర్‌' ట్రయల్స్‌

‘ఫావిపిరవిర్‌'  ట్రయల్స్‌

  • క్లినికల్‌ పరీక్షలకు ఆమోదం
  • ఔషధ తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్నిఅభివృద్ధి చేసిన ఐఐసీటీ హైదరాబాద్‌

న్యూఢిల్లీ, మే 9: కరోనా రోగులపై ఫావిపిరమిర్‌ ఔషధాన్ని ప్రయోగించడానికి (క్లినికల్‌ ట్రయిల్స్‌) డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించింది. ఈ ఔషధం తయారీకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌కు చెందిన ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ’ (ఐఐసీటీ) అభివృద్ధి చేసింది. దీన్ని ఓ ప్రైవేట్‌ కంపెనీకి అప్పగించింది. అయితే ఔషధాన్ని కరోనా రోగులపై ప్రయోగించాలంటే తొలుత డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి పొందాలి. ఈ నేపథ్యంలో అనుమతి కోసం దరఖాస్తు చేయగా క్లినికల్‌ ట్రయిల్స్‌కు ఆమోదం లభించిందని సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ మండే తెలిపారు. ట్రయిల్స్‌ కోసం దవాఖానలతో సంబంధిత కంపెనీ ఒప్పందం కుదుర్చుకోవచ్చని చెప్పారు. కరోనా రోగులు కోలుకోవడానికి ఫావిపిరవిర్‌ ఔషధాన్ని ఇప్పటికే చైనా, జపాన్‌లాంటి దేశాలు ఉపయోగిస్తున్నాయన్నారు. ఒకసారి వైరస్‌ మానవుడి కణాల్లోకి ప్రవేశించాక అది ప్రతిరూపాలను (వైరస్‌ను పోలిన పలు నకళ్లు) సృష్టిస్తుందని చెప్పారు. అయితే ఫావిపిరవిర్‌ను ఉపయోగించడం వల్ల ఈ ప్రతిరూపాల సృష్టికి అడ్డుకట్టపడుతుందన్నారు. తద్వారా రోగి తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని శేఖర్‌ మండే పేర్కొన్నారు.


యాంటీవైరల్‌ డ్రగ్‌ కాంబోతో సత్ఫలితాలు

కరోనాను అడ్డుకోవడంలో మూడు యాంటీ వైరల్‌ ఔషధాల సమ్మేళనం బాగా పనిచేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కరోనా లక్షణాలు కనిపించిన వారంలోపే ఈ మిశ్రమాన్ని వాడగా రోగి శరీరంలో వైరస్‌లోడ్‌ గణనీయంగా తగ్గిం ది. లొపినవిర్‌-రిటొనవిర్‌ మాత్రమే వాడ డం కంటే ఇంటర్‌ఫెరాన్‌ బీటా-1బి, లొపినవిర్‌-రిటొనవిర్‌, రిబవిరిన్‌ డ్రగ్స్‌ను కలిపి వాడడం వల్ల మంచి ఫలితాలు కనిపించినట్లు హాంకాంగ్‌ వైద్యులు పేర్కొన్నారు.


logo