శుక్రవారం 05 జూన్ 2020
National - May 11, 2020 , 15:47:35

గ్రాడ్యుయేష‌న్ విద్యార్థుల కోసం పీజీ డిప్లామ కోర్సులు: ఐఐటీ గాంధీన‌గ‌ర్

గ్రాడ్యుయేష‌న్ విద్యార్థుల కోసం పీజీ డిప్లామ కోర్సులు: ఐఐటీ గాంధీన‌గ‌ర్

న్యూఢిల్లీ:  ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) గాంధీ న‌గ‌ర్ ఒక సంవ‌త్స‌రం డిప్లొమా కోర్సులు ప్ర‌వేశ‌పెట్టింది.  క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఉన్న‌త విద్యా, ఉపాధి ప్లానింగ్ దెబ్బ‌తిన్న గ్రాడ్యుయేష‌న్ విద్యార్థుల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌యోలాజిక‌ల్ ఇంజ‌నీరింగ్, కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, సివిల్ ఇంజ‌నీరింగ్, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్, ఎర్త్ సిస్ట‌మ్ సైన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజనీరింగ్‌, మెటిరియ‌ల్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్ కోర్సుల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు అందిస్తున్నారు. 

ఈకోర్సు చేసిన విద్యార్థులు ఎంటెక్‌లో లెట‌ర‌ల్ ఎంట్రీతో ప్ర‌వేశం పొంద‌వ‌చ్చు. ప్ర‌తిభావంతులైన విద్యార్థుల కోసం రీసెర్చ్ అండ్ లీడ‌ర్‌షిప్ ఫెలోషిప్‌లు ప్ర‌వేశ‌ప‌ట్టామ‌ని, కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా విద్యార్థుల భ‌విష్య‌త్ దెబ్బ‌తిన‌కుండా ఉండేందుకు ఐఐటీ గాంధీన‌గ‌ర్ కోర్సులు ప్ర‌వేశ‌పెట్టింద‌ని డైరెక్ట‌ర్ సుధీర్ కె జైన్ తెలిపారు. ఈ అవ‌కాశం విద్యార్థులు ఉప‌యోగించుకుని లీడ‌ర్‌షిప్ క్వాలిటీని, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల‌ని సూచించారు. 

ప్ర‌తిభావంతులైన విద్యార్థుల కోసం, లీడ‌ర్‌షిప్ నాణ్య‌త‌ను పెంపొందించ‌డానికి జూనియ‌ర్ ఫెలోషిప్‌కు అవ‌కాశం క‌ల్పించాం. 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి లీడ‌ర్‌షిప్‌పై 10 జూనియ‌ర్ ఫెలోషిప్‌లు అందిస్తున్నామ‌న్నారు. బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఎ చ‌దువుతున్న చివ‌రి సంవ‌త్స‌రం విద్యార్థుల కోసం  స‌బ‌ర్మ‌తి బ్రిడ్జ్ ఫెలోషిప్ గాంధీన‌గ‌ర్ ఐఐటీ అందిస్తుంది. ప‌రిశోధ‌నా స‌మ‌స్య‌ల‌పై విద్యార్థుల‌కు ఫ్యాక‌ల్టీ స‌భ్యుల‌తో క‌లిసి ప‌నిచేసే వీలు క‌ల్పిస్తుంద‌ని పేర్కొన్నారు. 


logo