ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 14:25:51

ఉద్యోగాలక‌ల్ప‌న‌లో ఐఐటీ ఢిల్లీ టాప్‌

ఉద్యోగాలక‌ల్ప‌న‌లో ఐఐటీ ఢిల్లీ టాప్‌

న్యూఢిల్లీ: అక్క‌డ చ‌దివితే ఉద్యోగం త‌ప్ప‌నిస‌రిగా ల‌భిస్తుంది. అవును.. దేశంలో అత్య‌ధిక ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తున్న యూనివర్సిటీగా ఐఐటీ ఢిల్లీ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉద్యోగ అవ‌కాలు ఎక్కువ‌గా క‌ల్పిస్తున్న యూనివ‌ర్సిటీల జాబితాను గ్లోబ‌ల్ ఎంప్లాయ‌బిలిటీ ర్యాంకింగ్ అండ్‌ స‌ర్వే (జీఈయూఆర్ఎస్‌)-2020 పేరుతో ఫ్రెంచ్ హెచ్ఆర్ క‌న్స‌ల్టెన్సీ గ్రూప్‌, టైమ్స్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ రూపొందించాయి. ఇటీవ‌ల విడుద‌లైన ఈ జాబితా ప్ర‌కారం దేశంలో అత్య‌ధికంగా ఉపాధి అకాశాలు క‌ల్పిస్తున్న యూనివ‌ర్సిటీల్లో ఐఐటీ ఢిల్లీ అగ్ర‌స్థానంలో నిలిచింది. ప్ర‌పంచంలోని టాప్ 50లో 27వ స్థానం సంపాదించింది.  

ఇక, అమెరికాకు చెందిన యూనివ‌ర్సిటీలు టాప్‌లో ఉండ‌గా, జ‌ర్మ‌నీ, చైనా,  ద‌క్షిణ కొరియా వంటి దేశాల్లోని వ‌ర్సిటీలు కూడా గ‌త ద‌శాబ్ద కాలంలో అత్య‌ధిక ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తూ త‌మ స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకున్నాయి. అదేవిధంగా భార‌త‌దేశానికి చెందిన వ‌ర్సిటీలు కూడా గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించాయి. టాప్ 250 యూనివ‌ర్సిటీల్లో మ‌న దేశానికి చెందిన వ‌ర్సిటీలు కూడా ఉన్నాయి. వాటిలో ఐఐటీ ఢిల్లీ గ‌తంలోకంటే 27 స్థానాలు మెరుగుప‌రుచుకుని 27వ స్థానినానికి చేరింది. 2019లో ఈ ఐఐటీ 54వ స్థానంలో ఉన్న‌ది. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌‌-బెంగ‌ళూరు 43 స్థానాలు మెరుగుప‌డి 71 ప్లేస్‌లో నిలిచింది.  ఐఐటీ బాంబే 128వ ర్యాంకుతో టాప్ 150లో ఉండ‌గా, ఐఐఎం అహ్మ‌దాబాద్ 184, ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ 195, అమిటీ యూనివ‌ర్సిటీ 236వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో మొద‌టి 15 స్థానాల్లో అమెరికాకు చెందిన 7 వ‌ర్సిటీలు ఉండ‌గా, జ‌పాన్‌, కెన‌డా, సింగ‌పూర్‌, జ‌ర్మ‌నీ, స్విట్జ‌ర్లాండ్‌, ఆస్ట్రేలియ‌కు చెందిన ఇత‌ర విశ్వ‌విద్యాల‌యాలు ఉన్నాయి.