గురువారం 02 జూలై 2020
National - Jun 25, 2020 , 09:31:34

ఐఐటీ బాంబే... ఈ ఏడాదంతా ఆన్‌లైన్ పాఠాలే

ఐఐటీ బాంబే... ఈ ఏడాదంతా ఆన్‌లైన్ పాఠాలే

హైద‌రాబాద్‌: ముంబైలో ఉన్న ఇండియ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. ఈ ఏడాది ఫేస్ టు ఫేస్ పాఠాల‌ను ర‌ద్దు చేసింది. కోవిడ్‌19 నేప‌థ్యంలో ఆ విద్యా సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే కొత్త సెమిస్ట‌ర్ పాఠాలు జ‌రుగుతాయ‌ని ఆ విద్యాసంస్థ డైర‌క్ట‌ర్ సుభాషిస్ చౌద‌రి ప్ర‌క‌టించారు.  ఈ ఏడాది మొత్తం క్లాస్‌రూమ్ పాఠాలు ర‌ద్దు చేసిన తొలి ప్ర‌ఖ్యాత విద్యా సంస్థ‌గా ఐఐటీ బాంబే నిలిచింది. విద్యార్థుల క్షేమం దృష్ట్యా.. ఈ సారి మొత్తం ఆన్‌లైన్ పాఠాలే ఉంటాయ‌ని చౌద‌రి వెల్ల‌డించారు.

వార్షిక సంవ‌త్స‌రాన్ని ఆల‌స్యం చేయ‌కుండా ఉండేందుకు.. ఆన్‌లైన్ విధానాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు ఐఐటీ బాంబే పేర్కొన్న‌ది. 62 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన బాంబే ఇన్స్‌టిట్యూట్‌లో.. విద్యార్థులు లేకుండానే కొత్త వార్షిక సంవ‌త్స‌రాన్ని స్టార్ట్ చేయ‌డం ఇదే తొలిసారి.అయితే ఐఐటీ బాంబేలో చ‌దువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది ఆర్థికంగా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల నుంచి వ‌స్తుంటార‌ని, అయితే ఆ విద్యార్థులు ల్యాప్‌టాప్‌లు, ఇంట‌ర్నెట్ డేటా కొనేందుకు దాత‌లు స‌హ‌కరించాల‌ని చౌద‌రి త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. విద్యార్థుల ల్యాప్‌టాప్‌లు, ఇత‌ర టెక్నిక‌ల్ ఎక్విప్మెంట్ కోసం దాదాపు 5 కోట్లు అవ‌స‌రం ఉంటుంద‌న్నారు.logo