న్యూఢిల్లీ: ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న అన్ని రకాల కరోనా వైరస్ వేరియంట్లను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అభివృద్ధి చేసిన ‘వార్మ్ ( warm )’ వ్యాక్సిన్ సమర్థవంతంగా నిరోధిస్తుందని తేలింది.
ఈ వ్యాక్సిన్‌ను బయోటెక్ స్టార్టప్ మైన్వాక్స్తో కలిసి ఐఐఎస్సీ రూపొందించింది. ఎలుకలపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసింది. శక్తిమంతమైన రోగ నిరోధక శక్తిని ప్రదర్శించింది.
కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్వో) నిర్వహించిన సర్వేలో ఈ సంగతి తెలిసింది. ఈ సర్వే వివరాలు ఏసీఎస్ ఇన్ఫెక్షియస్ డిసేజెస్ జర్నల్‌లో ప్రచురితమైంది.
100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఈ వ్యాక్సిన్ 90 నిమిషాలు, 37 డిగ్రీల సెల్సియస్ వద్ద శక్తి సామర్థ్యాలు స్థిరంగా ఉంటాయి. దీన్ని బట్టి కరోనా వ్యాక్సిన్లకు రిఫ్రిజిరేషన్ తప్పనిసరి.