శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 07:19:22

రసా‌యన ఎరువు కావా‌లంటే బయో ఎరువు కొనా‌ల్సిందే!

రసా‌యన ఎరువు కావా‌లంటే బయో ఎరువు కొనా‌ల్సిందే!

న్యూఢిల్లీ: దేశంలో రసా‌యన ఎరు‌వుల వాడ‌కాన్ని తగ్గిం‌చేం‌దుకు కేంద్ర‌ం కీలక నిర్ణయం తీసు‌కొనే అవ‌కాశం ఉంది. యూరియా కొనా‌లంటే దాంతో‌పాటే జీవ ఎరు‌వును (బయో ఫర్టి‌లై‌జర్‌) కూడా కొనేలా నిబం‌ధ‌నలు రూపొం‌దిం‌చ‌ను‌న్నట్టు సమా‌చారం. రసా‌య‌నిక ఎరు‌వుల వాడ‌కాన్ని నియం‌త్రించే సూచ‌నల కోసం ఏర్పా‌టు‌చే‌సిన టాస్క్‌‌ఫోర్స్‌ ప్రభు‌త్వా‌నికి కీలక సూచ‌నలు చేసింది.

రైతు యూరియా కొనా‌లంటే దాంతో‌పాటే ఏదైనా జీవ ఎరువు కూడా కొనేలా నిబం‌ధన పెట్టా‌లని సూచిం‌చి‌నట్టు కేంద్ర‌వ్య‌వ‌సా‌య‌శాఖ వర్గాలు తెలి‌పాయి. ఎరు‌వు‌లను చల్ల‌కుండా నీటితో కలిపి డ్రిప్‌‌ద్వారా అందిస్తే 30నుంచి 40శాతం పోష‌కా‌లను కాపా‌డ‌వ‌చ్చని, 50శాతం నీటిని కూడా ఆదా‌చే‌య‌వ‌చ్చని సూచిం‌చి‌నట్టు సమా‌చారం.logo