ఆదివారం 05 జూలై 2020
National - Jun 22, 2020 , 20:07:57

క‌రోనాకు టీకానే క‌చ్చిత ప‌రిష్కారం: నితిన్ గ‌డ్క‌రీ

క‌రోనాకు టీకానే క‌చ్చిత ప‌రిష్కారం: నితిన్ గ‌డ్క‌రీ

ముంబై: ప‌్ర‌పంచ దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. వివిధ దేశాల్లో కేసులు ల‌క్ష‌ల్లో, మ‌ర‌ణాలు వేల‌ల్లో న‌మోద‌వుతున్నాయి. మ‌న దేశంలోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ఇప్ప‌టికే కేసుల సంఖ్య నాలుగు ల‌క్ష‌లు దాట‌గా, మ‌ర‌ణాలు 15 వేల‌కు చేరువ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త‌పై స్పందించారు. 

క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు వాక్సిన్ ఒక్క‌టే స‌రైన ప‌రిష్కార‌మ‌ని నితిన్ గ‌డ్క‌రీ చెప్పారు. వాక్సిన్‌ను క‌నిపెట్ట‌డం కోసం చాలా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయన్నారు. వాక్సిన్‌ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ల‌యితే.. స‌మ‌స్య‌కు 100 శాతం ప‌రిష్కారం ల‌భించిన‌ట్లేన‌ని గ‌డ్కరీ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం వాక్సిన్ అందుబాటులో లేనందున క‌రోనాతో క‌లిసి జీవించ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ముఖ్యంగా ముంబై, పుణె, ఢిల్లీ న‌గ‌రాల ప్ర‌జ‌లు క‌రోనా జీవించాల్సిందేన‌ని ఆయ‌న చెప్పారు.                        


logo