బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 18:03:36

కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే.. అంబానీ ఎలా అభివృద్ది చెందాడు?

కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే.. అంబానీ ఎలా అభివృద్ది చెందాడు?

ముంబై : కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంటే ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 150 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యుయేషన్ మార్కును చేరుకున్న మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. ఈవారం ప్రారంభంలో బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ సూచిక ప్రకారం ముకేశ్‌ అంబానీ 72.4 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన ప్రపంచంలోని ఆరో ధనవంతుడిగా నిలిచాడు. 

మార్చిలో డిజిటల్ యూనిట్ జియోకు ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, ఇటీవల క్వాల్‌కామ్ వంటి సంస్థల నుంచి బిలియన్ల పెట్టుబడులు రావడంతో షేర్లు కనిష్టానికి రెట్టింపు అయ్యాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌కు విదేశీ కంపెనీల నుంచి 12 చెక్కుల రూపంలో సుమారు రూ.1.15 లక్షల కోట్లు వచ్చినట్లు సమాచారం. జూలై 15న జరిగిన రిలయన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ప్లాట్‌ఫామ్‌లలో 7.7 శాతం వాటా కోసం గూగుల్ 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని, జియోతో గూగుల్ భాగస్వామ్యం గురించి తాను సంతోషిస్తున్నానని అంబానీ ప్రకటించారు.

ఈ పెట్టుబడుల తరువాత జూన్ నెలలో రిలయన్స్‌ రూ.84,000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది భారీ పెట్టుబడిదారుల ఆసక్తిని సంపాదించింది. 1.59 రెట్లు అధికంగా సభ్యత్వాన్ని పొందింది. అంబానీ పరిమాణం, స్థాయి, వేగం అనే మూడంచెల వ్యూహంతో పనిచేస్తారు. పెట్టుబడులు పెట్టడం, హక్కుల సమస్య ద్వారా జియో కోసం ఆశ్చర్యకరంగా నిధులు సమకూర్చడంలో ఇది అతడికి సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఇది రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా ఏర్పాటయ్యేందుకు వీలు కల్పించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo