శనివారం 04 జూలై 2020
National - Jun 22, 2020 , 13:09:25

రేపు ర‌థ‌యాత్ర జ‌ర‌గ‌‌కుంటే.. 12 ఏళ్లు జ‌గ‌న్నాథుడు బ‌యట‌‌కురాడు

రేపు ర‌థ‌యాత్ర జ‌ర‌గ‌‌కుంటే.. 12 ఏళ్లు జ‌గ‌న్నాథుడు బ‌యట‌‌కురాడు

హైద‌రాబాద్‌:  ఒడిశాలోని పూరిలో రేపు జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర జ‌ర‌గాల్సి ఉన్న‌ది. కానీ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆ యాత్ర‌పై ఆంక్ష‌లు విధించింది. క‌రోనా వేళ యాత్ర‌కు కోర్ట్ అనుమ‌తి ఇవ్వ‌లేదు. యాత్ర‌కు అనుమ‌తి ఇస్తే త‌మ‌ను ఆ జ‌గ‌న్నాథుడు క్ష‌మించ‌డ‌ని కోర్టు పేర్కొన్న‌ది.  అయితే ఆ తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నాలుగు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి.  ర‌థ‌యాత్ర‌ను నిర్వ‌హించేందుకు సంసిద్ధంగా ఉన్నామ‌ని కేంద్రం, ఒడిశా ప్ర‌భుత్వం సుప్రీంకు తెలియ‌జేసింది.   

ఈ కేసుపై ఇవాళ‌ సుప్రీంలో ఆస‌క్తిక‌ర వాద‌న‌లు జ‌రిగాయి. ఇది కోట్ల మంది విశ్వాసాల‌కు సంబంధించిన అంశ‌మ‌ని, రేపు జ‌గ‌న్నాథుడు బ‌య‌ట‌కు రాకుంటే, సంప్ర‌దాయం ప్రకారం ఆ స్వామి 12 ఏళ్లు యాత్ర‌కు దూరం అవుతాడ‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు తెలియ‌జేశారు.  రేపు జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర సంద‌ర్భంగా పూరిలో క‌ర్ఫ్యూను విధించి వైర‌స్ వ్యాప్తి చేయ‌కుండా రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంని కేంద్రం కోర్టుకు వెల్ల‌డించింది.   

శ‌తాబ్ధాలుగా జ‌రుగుతున్న వేడుక‌ను అడ్డుకోలేమ‌ని, క‌రోనా ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వ‌చ్చిన‌వాళ్లు, జ‌గ‌న్నాథుడి ఆల‌యంలో ప‌నిచేస్తున్న వారు మాత్ర‌మే ఈ ర‌థ‌యాత్ర వేడుక‌లో పాల్గొంటార‌ని తుషార్ మెహ‌తా తెలిపారు. జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఈ కేసును విచారిస్తున్న‌ది.  అయితే ఈ కేసును త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఇవాళ సాయంత్రం విచారించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  


logo