శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 01, 2021 , 21:16:05

‘4న ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే.. రైతులే నిర్ణయిస్తారు’

‘4న ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే.. రైతులే నిర్ణయిస్తారు’

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న తమ డిమాండ్‌పై ఈ నెల 4న ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణపై రైతులే నిర్ణయం తీసుకుంటారని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి యుధ్‌వీర్‌ సింగ్‌ తెలిపారు. రైతులను కేంద్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తున్నదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం షాహీన్ బాగ్ నిరసనకారులను చెదరగొట్టగలిగింది, తమపట్ల కూడా అదే చేయాలని ఆలోచిస్తున్నదని దుయ్యబట్టారు. అయితే అలాంటి రోజు ఎప్పటికీ రాదన్నారు. జనవరి 4న జరిగే చర్చల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయాలన్నది రైతులు నిర్ణయిస్తారని యుధ్‌వీర్‌ సింగ్‌ వెల్లడించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo