ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 12:50:30

ఫ‌రూఖ్ అబ్దుల్లా.. పాక్ వెళ్లిపోవ‌చ్చు

ఫ‌రూఖ్ అబ్దుల్లా.. పాక్ వెళ్లిపోవ‌చ్చు

ముంబై: దేశంలో 370వ ఆర్టిక‌ల్‌కు, 35-ఏ ఆర్టిక‌ల్ అమ‌లు‌కు స్థానంలేద‌ని శివసేన నేత‌, ఎంపీ సంజ‌య్ రౌత్ అన్నారు. జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూఖ్ అబ్దుల్లా పాకిస్థాన్ వెళ్లాల‌నుకుంటే వెళ్లిపోవ‌చ్చ‌ని, అక్క‌డ 370 ఆర్టిక‌ల్‌ను అమ‌లు చేసుకోవ‌చ్చ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

చైనా స‌హ‌కారంతోనైనా జ‌మ్ముక‌శ్మీర్‌లో 370 ఆర్టిక‌ల్‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని ఫ‌రూఖ్‌ అబ్దుల్లా గ‌త నెల‌లో ప్ర‌క‌టించారు. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేసే నేత‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంజ‌య్‌ డిమాండ్ చేశారు. దేశంలో ఉమ్మ‌డి పౌర‌స‌త్వాన్ని అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. ‌