సోమవారం 25 మే 2020
National - Apr 04, 2020 , 11:33:55

ఏడాది కింద కరోనా వచ్చుంటేనా...

ఏడాది కింద కరోనా వచ్చుంటేనా...

అమరావతి : విపత్కర పరిస్థితుల్లో, ఆపత్కాలంలో చర్యలు తీసుకోవాల్సి వస్తే ఏపీ మాజీ సీఎం ఏ విధంగా ప్రవర్తించేవారో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ ద్వారా తన స్పందనను తెలియజేశారు. ఇదే కరోనా వైరస్‌ ఏడాది క్రింద వచ్చి ఉంటే పచ్చ మీడియాను వెంటేసుకుని ఆస్పత్రుల చుట్టూ, క్వారంటైన్‌ వార్డుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడన్నారు. వైద్యులను మందలించడం, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. తాను రాకపోతే పరిస్థితి ఏంటని నిలదీయడాలు వంటవి ఉండేవన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు లేడే అని పొరుగు రాష్ర్టాల ప్రజలు శోకాలు పెట్టినట్లుగా ప్రచారాలు చేయించుకునేవాడు. అబ్బో ఆ వేషాలు చెప్పనలవి కాకుండా ఉండేవని ఆయన పేర్కొన్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo