మంగళవారం 14 జూలై 2020
National - Jun 15, 2020 , 17:54:58

కరోనా వ్యాధి సోకితే.. ఐసోలేషన్‌కు తీసుకువెళ్లాల్సిన వస్తువులివే!

కరోనా వ్యాధి సోకితే.. ఐసోలేషన్‌కు తీసుకువెళ్లాల్సిన వస్తువులివే!

ఇప్పుడున్న పరిస్థితుల్లో జలుబు, దగ్గు, జ్వరం చిన్న రోగాలే అయినా కరోనాకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఐసోలేషన్‌కు వెళ్లేటప్పుడు ఈ వస్తువులు వెంట తీసుకొని వెళ్లండని ఓ యువతి సూచనలు ఇస్తున్నది. ఈమె ఒక ప్రభుత్వ హాస్పిటల్‌లో కొవిడ్‌-19కు చికిత్స పొంది రికవరీ అయిన మహిళ.

ఐసోలేషన్‌కు వెళ్లేటప్పుడు 'మొబైల్‌, పవర్‌బ్యాంక్‌, చార్జర్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. 14 రోజులు అక్కడే ఉండాలి కాబట్టి సరిపడా బట్టలు అవసరం. ఈ సమయంలో బోర్‌ కొట్టకుండా ఉండేందుకు పుస్తకాలు, డ్రాయింగ్‌కు కావాల్సిన రంగులు తీసుకెళ్తే బెటర్‌. కరోనా నుంచి బయట పడాలంటే.. వేడి నీరు తాగాల్సి వస్తుంది. కాబట్టి, ప్లాస్టిక్‌ బాటిల్‌కు బదులు కాపర్‌ బాటిల్‌ బెటర్‌. భోజనవేళల్లో కాకుండా మధ్యలో ఆకలిగా ఉన్నప్పుడు తినేందుకు.. పోషకాలున్న పండ్లు తీసుకెళ్లడం మంచిది. స్నానానికి అవసరమయ్యే టవల్‌, సబ్బు, టూత్‌పేస్ట్‌, బ్రష్‌ తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. ఈ వస్తువులన్నీ వెంటుంటే ఐసోలేషన్‌లో ఉన్నా.. ఇంట్లో ఉన్నట్లే! అంటున్నది యువతి.


logo