సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 30, 2020 , 11:43:30

బాబ్రీ కేసులో దోషిగా తేలితే.. అయిదేళ్ల జైలుశిక్ష

బాబ్రీ కేసులో దోషిగా తేలితే.. అయిదేళ్ల జైలుశిక్ష

హైద‌రాబాద్‌:  బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో కాసేప‌ట్లో ల‌క్నో సీబీఐ కోర్టు తీర్పును వెలువ‌రించున‌న్న‌ది. ఒక‌వేళ ఈ కేసులో నిందితులు దోషిగా తేలితే వారికి అయిదేళ్లు శిక్ష ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు న్యాయ‌నిపుణులు భావిస్తున్నారు.  అద్వానీ, ముర‌ళీమ‌నోహ‌ర్ జోషీ, ఉమాభార‌తి, వియ‌న్ క‌టియార్‌, సాధ్వి రితంబ‌రా, మ‌హంత్ నృత్య గోపాల్ దాస్‌, చంప‌త్ రాయ్ బ‌న్సాల్‌, రామ్ విలాస్ వేదాంతి, ధ‌ర్మ‌దాస్‌, స‌తీష్ ప్ర‌దాన్ లాంటి వారికి అత్య‌ధికంగా అయిదేళ్ల శిక్ష ప‌డే ఛాన్సు ఉంటుంది.  ఒక‌వేళ ఇదే కేసులో యూపీ మాజీ సీఎం క‌ళ్యాణ్ సింగ్‌, బీజేపీ ఎంపీ సాక్షీ మ‌హారాజ్‌, అయోధ్య మెజిస్ట్రేట్ ఆర్ఎన్ శ్రీవాత్స‌వ్‌లు దోషిగా తేలితే వారికి క‌నీసం మూడేళ్ల శిక్ష ప‌డుతుంద‌ని న్యాయ‌కోవిదులు భావిస్తున్నారు. 

ల‌క్నోలోని ఓల్డ్ హైకోర్టులో బాబ్రీ కేసు తీర్పును వెలువ‌రించ‌నున్నారు.  కోర్టు బిల్డింగ్ ఆవ‌ర‌ణ‌లో తీర్పు నేప‌థ్యంలో బ్యారికేడ్ల‌ను పెట్టారు. ప‌టిష్ట‌మైన బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.  కోర్టు ప‌రిస‌ర ప్రాంతాల్లో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను త‌గ్గించారు.  కేసులో నిందితులుగా ఉన్న‌వారిని ప‌రిశీలించిన త‌ర్వాత కోర్టు హాల్‌లోకి అనుమ‌తించారు.  నిందితుల మ‌ద్ద‌తుదారులను ఎవ‌ర్నీ లోప‌లికి వెళ్ల‌నివ్వ‌లేదు.  మీడియా ప్ర‌తినిధుల‌ను కూడా కోర్టు ప్రాంగ‌ణంలోకి వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. 


logo