ఆదివారం 31 మే 2020
National - May 24, 2020 , 11:44:04

క్వారెంటైన్‌కు నిరాక‌రిస్తే జైలుకే: మ‌ణిపూర్ సీఎం

క్వారెంటైన్‌కు నిరాక‌రిస్తే జైలుకే: మ‌ణిపూర్ సీఎం

ఇంఫాల్‌: లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుని స్వరాష్ట్రానికి త‌ర‌లి వస్తున్న మణిపూర్ ప్ర‌జ‌లు కచ్చితంగా క్వారంటైన్‌కు వెళ్లాలని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి బిరేన్ సింగ్ ఆదేశించారు. ఈ నిబంధన పాటించని వారు జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన హెచ్చ‌రించారు. నిందితులపైన‌ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారిని ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేసినా విజృంభిస్తుంద‌ని సీఎం బీరేన్ సింగ్ చెప్పారు.  

'ఇది చాలా పెద్ద సమస్య. స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న వారు నిబంధనలను అతిక్రమించిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపించాల్సి వస్తుంది. రాష్ట్రానికి తిరిగివస్తున్న వారు క‌రోనా వైర‌స్ లేక‌పోయినా హొం క్వారెంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే హోం క్వారెంటైన్‌ ఇబ్బందిగా ఉన్న వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలిస్తాం' అని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి కంగారు పడొద్దని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయ‌న‌ చెప్పారు.


logo