బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 28, 2020 , 12:49:56

దిశ ఎన్‌కౌంటర్‌.. ఏదైనా న్యాయ కమిషన్‌తో చెప్పుకోండి

దిశ ఎన్‌కౌంటర్‌.. ఏదైనా న్యాయ కమిషన్‌తో చెప్పుకోండి

ఢిల్లీ: దిశ నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అదేవిధంగా ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.50 లక్షలు ఇవ్వాలని కోరుతూ నిందితుల కుటుంబ సభ్యులు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ బోబ్డే స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్‌ వేశామని ఈ సమయంలో పిటిషన్‌ను విచారించలేమని పేర్కొన్నారు. కాగా న్యాయ విచారణ కమిషన్‌ను కలిసే స్వతంత్రత పిటిషనర్లకు ఇస్తున్నామన్నారు. ఏం చెప్పాలనుకున్నా న్యాయ కమిషన్‌కు చెప్పాల్సిందిగా సూచించారు. న్యాయం జరగలేదని భావిస్తే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సీజేఐ తెలిపారు. సీజేఐ సూచనతో న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.


logo