ఆదివారం 31 మే 2020
National - May 21, 2020 , 15:51:44

ఆరోగ్య‌సేతు రెడ్ స్టాట‌స్ ఉంటే విమానం ఎక్క‌నివ్వ‌రు..

ఆరోగ్య‌సేతు రెడ్ స్టాట‌స్ ఉంటే విమానం ఎక్క‌నివ్వ‌రు..


హైద‌రాబాద్‌:  ఆరోగ్య‌సేతు యాప్‌లో మీ స్టాట‌స్ చాలా ముఖ్యం. ఒక‌వేళ దాంట్లో రెడ్ స్టాట‌స్ చూపిస్తే, అప్పుడు మీకు విమానం ప్ర‌యాణం ఉండ‌దు.  ఆరోగ్య‌సేతులో రెడ్ స్టాట‌స్ ఉన్న‌వారిని విమాన ప్ర‌యాణానికి అనుమ‌తించ‌మ‌ని విమాన‌యాన‌శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి తెలిపారు. 25వ తేదీ నుంచి దేశీయ విమానాల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. మూడ‌వ వంతు సామ‌ర్థ్యంతో మెట్రో నుంచి మెట్రో న‌గ‌రాల‌కు విమాన స‌ర్వీసులు న‌డ‌పనున్న‌ట్లు తెలిపారు.అంటే ప్ర‌యాణికుల శాతం 33.33 క‌న్నా ఎక్కువే ఉంటుంది.  విమాన ప్ర‌యాణికులు ప్రొటెక్టివ్ గియ‌ర్‌, ఫేస్ మాస్క్‌, శానిటైజ‌ర్ బాటిల్ క‌లిగి ఉండాల‌న్నారు. ఎయిర్‌లైన్స్ మీల్స్ ఏర్పాటు చేయ‌ద‌న్నారు. గ్యాల‌రీలో, విమాన సీట్ల‌లో వాట‌ర్ బాటిల్స్ ఉంటాయ‌న్నారు.  విమాన ఛార్జీల ధ‌ర‌ల్లో మార్పు ఉంటుంద‌న్నారు. క‌నీస ధ‌ర రూ.3500,  గ‌రిష్ట ధ‌ర 10వేలుగా నిర్ధారించారు. ఆగ‌స్టు 24 అర్థ‌రాత్రి వర‌కు ఈ ఛార్జీలు అమ‌లులో ఉంటాయి.logo