మంగళవారం 07 జూలై 2020
National - Apr 15, 2020 , 10:05:03

లాక్‌డౌన్ విధించ‌కుంటే భారీ న‌ష్టం జ‌రిగేది: కేంద్రం

లాక్‌డౌన్ విధించ‌కుంటే భారీ న‌ష్టం జ‌రిగేది: కేంద్రం

క‌రోనా నియంత్ర‌ణ‌కు లాక్‌డౌన్ స‌రైన మార్గ‌మ‌ని కేంద్రం తెలిపింది. లాక్‌డౌన్ విధించ‌కుంటే భారీ స్థాయిలో న‌ష్టం జ‌రిగేద‌ని పేర్కొంది. దీంతో చాలా వ‌ర‌కు క‌రోనా వ్యాప్తిని అడ్డుకున్నామ‌ని వివ‌రించింది. ఒక‌వేళ లాక్‌డౌన్ కాకుండా క‌ట్ట‌డి చర్య‌లు తీసుకుంటే ఏప్రిల్ 15 నాటికి 8ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యేవ‌ని కేంద్ర ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. ఈమేర‌కు ఒక రిపోర్ట్‌ను విడుద‌ల చేసింది. లాక్‌డౌన్ వ‌ల‌న ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 10,815 కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. లాక్‌డౌన్‌తోనే వైర‌స్ వ్యాప్తిని చాలా వ‌ర‌కు నియంత్రించామ‌ని..ఇంకా మే 3వ‌ర‌కు కూడా అందరూ ఇంట్లోనూ ఉంటూ ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని సూచించింది.logo