శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 15:03:10

ఐఈడీ నిర్వీర్యం.. ఉగ్రవాదుల కుట్ర భగ్నం

ఐఈడీ నిర్వీర్యం.. ఉగ్రవాదుల కుట్ర భగ్నం

పుల్వామా : జుమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా గంగో ప్రాంతంలోని ఆటోమొబైల్‌ శిఖరం వద్ద భద్రతా దళాలు ఐఈడీ(ఇంప్రవైజీడ్‌ ఎక్స్‌ఫోజివ్‌ డివైజ్‌)ను ఆదివారం సురక్షితంగా నిర్వీర్యం చేసినట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. పుల్వామా పోలీసులు, సీఆర్పీఎఫ్‌, భద్రతా దళాలు సకాలంలో స్పందించి మరో దుర్ఘటన జరగకుండా చూశారు.  ఉదయం 7గంటల 40 నిమిషాలకు ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ దాడిలో ఓ జవాన్‌కు గాయపడడంతో అతడిని చికిత్స నిమిత్తం ఎంఐ యూనిట్‌కు తరలించినట్లు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది తెలిపారు. సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొనే ఈ ఐఈడీని పేల్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంగో ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. logo