గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 19:51:38

13 బాంబులు, 6 ప్రెషర్‌ కుక్కర్‌ ఐఈడీలు నిర్వీర్యం

13 బాంబులు, 6 ప్రెషర్‌ కుక్కర్‌ ఐఈడీలు నిర్వీర్యం

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో 195 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్లు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించారు. జగదల్‌పూర్‌ పట్టణానికి సమీపంలోని ఘోటియా అటవీ ప్రాంతంలో భూమిలో పాతిపెట్టిన బాంబులను జవాన్లు గుర్తించారు. 13 బాంబులు, 6 ప్రెషర్‌ కుక్కర్‌ ఐఈడీలు, ఒక పైప్‌ బాంబు, ఒక దేశీ మోర్టార్‌ బాంబు, 2 పెట్రోల్‌ బాంబులను జవాన్లు గుర్తించి.. వాటిని నిర్వీర్యం చేశారు. 

దంతెవాడ జిల్లాలో డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్స్‌ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారు. వారిద్దరి నుంచి రెండు ఐఈడీలు, 3 పైప్‌ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. 


logo