గురువారం 04 జూన్ 2020
National - May 14, 2020 , 11:57:12

మూడు కిలోల ఐఈడీ బాంబు నిర్వీర్యం

మూడు కిలోల ఐఈడీ బాంబు నిర్వీర్యం

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో సద్దార్‌ తులర్‌ గుఫా రోడ్డులో జవాన్లు.. ఐఈడీ బాంబును గుర్తించారు. అనంతరం బాంబు డిస్పోజబుల్‌ స్కాడ్‌.. ఐఈడీ బాంబును నిర్వీర్యం చేసింది. ఈ బాంబు బరువు మూడు కిలోలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఐఈడీ బాంబును నిర్వీర్యం చేయడంతో పెనుప్రమాదం తప్పింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రాంతంలో జవాన్ల కూంబింగ్‌ కొనసాగుతోంది.


logo