సోమవారం 30 మార్చి 2020
National - Mar 16, 2020 , 18:43:54

మందుపాతర పేలుడు: జవానుకు గాయాలు

మందుపాతర పేలుడు: జవానుకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లా పరతాపూర్‌ సమీపంలో మందుపాతర పేలింది. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలీసులు తేరుకునేలోపు మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డాడు. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడ్డారని, ఘటనా స్థలం వద్ద భారీగా మందుగుండు సామాగ్రీ స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ ఐజీ సుదర్‌రాజ్‌ ప్రకటించారు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలను అప్రమత్తం చేసినట్లు, ఎవరైనా గాయాలతో, లేదా కొత్తవారు గ్రామానికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఐజీ విజ్ఞప్తి చేశారు. 


logo