సోమవారం 06 జూలై 2020
National - Jun 23, 2020 , 11:51:14

ర‌థం వ‌ద్ద‌కు జ‌గ‌న్నాథుడు, బ‌ల‌భ‌ద్రుడు..

ర‌థం వ‌ద్ద‌కు జ‌గ‌న్నాథుడు, బ‌ల‌భ‌ద్రుడు..

హైద‌రాబాద్‌:  సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఒడిశాలోని పూరీలో.. జ‌గన్నాథ ర‌థ‌యాత్ర‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. యాత్ర ప్రారంభం కావ‌డానికి పూర్వం ఆల‌య పూజారుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఓ పూజారికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది. అయితే ఆ పూజారిని ర‌థ‌యాత్ర‌కు దూరంగా ఉంచిన‌ట్లు ఒడిశా మంత్రి ప్ర‌తాప్ జేనా తెలిపారు.  ఇవాళ ఉద‌యం జ‌గ‌న్నాథుడి ఆల‌యంలో శానిటైజేష‌న్ చేశారు. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పూరీలో జ‌గ‌న్నాథ్ ర‌థ యాత్ర‌కు అనుమ‌తి ద‌క్కింది.  అయితే కేవ‌లం 500 మంది మాత్ర‌మే ర‌థాన్ని లాగాల‌ని సుప్రీం త‌న ఆదేశాల్లో స్ప‌ష్టంగా పేర్కొన్న‌ది. ఇవాళ ఉద‌యం జ‌గ‌న్నాథుడి మూర్తిని ర‌థం వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. పూజారులు(సేవాయ‌త్స్‌) ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.  జ‌గ‌న్నాథు ఆల‌యంలో ఉన్న బ‌ల‌భ‌ద్రుడి ఉత్స‌వ‌మూర్తిని కూడా పూజారులు ఇవాళ ఉద‌యం ర‌థం వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చారు. ఈ వేడుక‌ను క‌న్నుల‌పండుగా నిర్వ‌హించారు. 

జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు గ్రీటింగ్స్ తెలిపారు. భ‌క్తిభావంతో నిండిన ఈ వేడుక సంతోషాన్ని, శుభాన్ని, సంప‌ద‌ల‌ను ఇస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌ధాని ఈ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు.   


logo