బుధవారం 27 మే 2020
National - May 18, 2020 , 21:38:50

ఇక ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలుంటేనే కరోనా పరీక్షలు

ఇక ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలుంటేనే కరోనా పరీక్షలు

న్యూఢిల్లీ: ఇకపై ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలున్నా కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే వైరస్‌ పరీక్షలు జరుపకపోయినా అత్యవసర వైద్య సేవలు, కాన్పులను ఆలస్యం చేయకూడదు. కరోనా పరీక్షలకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సోమవారం జారీ చేసింది. విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిలో, సొంత రాష్ర్టాలకు చేరిన వలస కార్మికుల్లో ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలుంటే వారంలోపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని తెలిపింది. అలాగే ఈ లక్షణాలున్న వ్యాధులతో దవాఖానలో చేరిన రోగులతోపాటు కంటైన్మెంట్‌, క్వారంటైన్‌ ప్రదేశాల్లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికీ రియల్‌ టైమ్‌ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేయాలని పేర్కొన్నది. పాజిటివ్‌గా వచ్చినవారిని కలిసిన వారిలో కరోనా లక్షణాలు లేకపోయినా ఐదు నుంచి పది రోజుల మధ్యలో ఒకసారి వైరస్‌ పరీక్ష నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. దేశంలో వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను ఈ మేరకు సవరించింది. 


logo