ఆదివారం 05 జూలై 2020
National - Jun 15, 2020 , 17:18:39

న‌వంబ‌ర్‌లో క‌రోనా ఉదృతి.. మేం చెప్ప‌లేద‌న్న ఐసీఎంఆర్‌

న‌వంబ‌ర్‌లో క‌రోనా ఉదృతి.. మేం చెప్ప‌లేద‌న్న ఐసీఎంఆర్‌

హైద‌రాబాద్‌: ఐసీఎంఆర్ నిర్వ‌హించిన స్ట‌డీ ప్రకారం భార‌త్‌లో క‌రోనా వైర‌స్ కేసులు.. న‌వంబ‌ర్ నెల‌లో తార‌స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వెలుబ‌డ్డాయి. కానీ ఆ వార్త అవాస్త‌వ‌మ‌ని ఇవాళ ఐసీఎంఆర్‌ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న‌ది.  ఆ నివేదిక ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు ఉంద‌ని ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో కూడా పేర్కొన్న‌ది.  న‌వంబ‌ర్ చివ‌ర లోగా క‌రోనా వైర‌స్ కేసులు దేశంలో హెచ్చు స్థాయికి వెళ్తాయ‌న్న విషయంలో వాస్త‌వం లేద‌ని ఐసీఎంఆర్‌ వెల్ల‌డించింది. పీఐబీ త‌న ఫ్యాక్ట్ చెక్ లిస్టులోనూ ఈ వార్త‌ను పోస్టు చేసింది.  ఆ స్ట‌డీని ఐసీఎంఆర్ చేయ‌లేద‌ని పీఐబీ పేర్కొన్న‌ది. ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌కు త‌మ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని ఐసీఎంఆర్ స్ప‌ష్టం చేసింది.  logo