గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 21:01:58

పీజీఐఎంఈఆర్‌కు ఐసీఎంఆర్‌ గుర్తింపు

పీజీఐఎంఈఆర్‌కు ఐసీఎంఆర్‌ గుర్తింపు

ఛండీగఢ్‌: కొవిడ్‌-19 కచ్చిత నిర్ధారణకోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రారంభించిన యాంటీజెన్‌ ఆధారిత గుర్తింపు పరీక్షల క్లినికల్‌ ట్రయల్స్‌ కార్యక్రమం నిర్వహించేందుకుగానూ చంఢీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌ (పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) ఎంపికైంది. ఇందుకోసం ఐసీఎంఆర్‌ దేశవ్యాప్తంగా ఏడు ప్రాథమిక తృతీయ సంరక్షణా దవాఖానలను ఎంపిక చేయగా, అందులో పీజీఐఎంఈఆర్‌కు చోటు లభించిందని దవాఖాన పీఆర్వో పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈ విధానం పెరుగుతున్న కరోనా రోగుల గురించి తెలుసుకునేందుకు, అలాగే, వారిని తక్కువ వ్యవధిలో పెద్ద ఎత్తున గుర్తించడంలో సహాయపడుతుందన్నాడు.  

పీజీఐఎంఈఆర్‌ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్‌రాం మాట్లాడుతూ, ‘యాంటిజెన్-ఆధారిత డిటెక్షన్ పరీక్షల లభ్యత ప్రపంచవ్యాప్తంగా చాలా పరిమితం. ఇలాంటి పరీక్షలు చాలావరకు మితమైన సున్నితత్వం కలిగి ఉంటాయి. కానీ అధిక విశిష్టత ఉంటుది. ఈ పరీక్ష కొవిడ్‌ను గుర్తించేందుకు మంచి సాధనం. ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు మేము ఐసీఎంఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని పేర్కొన్నాడు. అవసరమైన చోట ఫాస్ట్ ట్రాక్ పరీక్షలు చేసేందుకు, సానుకూల కేసులను గుర్తించడంలో తాము సహాయపడతామని తెలిపాడు. logo