శనివారం 06 జూన్ 2020
National - May 21, 2020 , 20:40:14

అనుమానిత మరణాలకూ.. ‘కరోనా’ నిబంధనలే!

అనుమానిత మరణాలకూ.. ‘కరోనా’ నిబంధనలే!

న్యూఢిల్లీ: కరోనా అనుమానిత మరణాలకు సంబంధించి ఐసీఎంఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా కరోనా అనుమానిత లక్షణాలతో మరణిస్తే.. ఆ మృతదేహాల ముక్కు నుంచి నమూనాలు సేకరించాలని వైద్యసిబ్బందికి స్పష్టం చేసింది. వాటిని అత్యవసరంగా పరీక్షలకు పంపాలని, ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించాలని సూచించింది. ఆ తర్వాతే మృతదేహాన్ని మార్చురీకి తరలించాలని చెప్పింది. తుది నివేదిక వచ్చే వరకు అక్కడే ఉంచాలని స్పష్టంచేసింది. రోగ లక్షణాలు కనిపించనివారు, వైరస్‌ ఇంకా ఇంక్యుబేషన్‌ దశలో ఉన్నవారికి సంబంధించి నివేదికలు నెగిటివ్‌గా రావొచ్చని పేర్కొన్నది. చనిపోయినవారికి గతంలో ఏదేని వైరస్‌ సోకిన చరిత్ర ఉన్నా, గుర్తుతెలియని మృతదేహాలు వచ్చినా.. అనుమానిత రోగులుగానే గుర్తించాలని స్పష్టం చేసింది. వారికి పరీక్షలో నెగెటివ్‌ వచ్చినా ‘కరోనా’ నిబంధనల మధ్యే అంత్యక్రియలు జరుపాలని వెల్లడించింది. 

ఐసీఎంఆర్‌ సూచనలు ఇలా ఉన్నాయి.. అధికారుల సమక్షంలో మృతదేహాన్ని ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో చుట్టాలి. మృతదేహాలను నేరుగా బంధువులకు ఇవ్వకుండా.. జిల్లా అధికార యంత్రాంగానికి అప్పగించాలి. అంత్యక్రియలకు ఐదుగురు బంధువులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మృతదేహాలను వీలైనంతమేర విద్యుత్‌ దహనవాటికలో దహనం చేయాలి. అస్తికల వల్ల వైరస్‌ వ్యాప్తి చెందదు.. కాబట్టి బంధువులు వాటిని సేకరించవచ్చు. ఒకవేళ ఖననం చేయాలనుకుంటే ముందే 6-8 అడుగుల లోతు గొయ్యి తీయాలి. దానికి సిమెంట్‌ పూత తప్పనిసరి. మృతదేహానికి శవపరీక్ష పూర్తయిన తర్వాత హ్యాండ్‌వాష్‌, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. 


logo