సోమవారం 13 జూలై 2020
National - Jun 16, 2020 , 18:57:45

శాలరీ ఖాతాదారులకు ఐసీఐసీఐ తీపికబురు!

శాలరీ ఖాతాదారులకు ఐసీఐసీఐ తీపికబురు!

హైదరాబాద్‌ : ఖాతాదారుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌ తీపికబురునందించింది. శాలరీ అకౌంట్లు కలిగిన ఖాతాదారులకు ఇన్‌స్టాఫ్లెక్సీ పేరిట ఓడీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, మొబైల్‌ యాప్‌ ద్వారా ఇన్‌స్టాక్యాష్‌ను అప్లై చేసుకుంటే, దరఖాస్తును పరిశీలించి, 48గంటల్లోనే రుణం ఖాతాల్లో జమ చేయనున్నారు. వేతనం ఆధారంగా రుణ సదుపాయం వర్తిస్తుందని, వేతనానికి మూడు రెట్లు ఓడీ పొందవచ్చని, దీనిపై వడ్డి ఉంటుందని చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి కష్టకాలంలో వేతన ఖాతాదారులు ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది.


logo