గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 19, 2020 , 13:59:41

వాట్సాప్ ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు 25 రకాల సేవలు

వాట్సాప్ ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు 25 రకాల సేవలు

ముంబై : ఐసీఐసీఐ బ్యాంకు తమ కస్టమర్లకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవల వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాట్సాప్ సహాయంతో కస్టమర్లు సందేశం పంపించడం ద్వారా క్షణాల వ్యవధిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. అలాగే విద్యుత్, గ్యాస్, పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లు చెల్లించవచ్చు. అంతేకాకుండా ట్రేడ్ ఫైనాన్స్ వివరాలు తక్షణమే యాక్సెస్ చేయవచ్చు. బ్యాంకింగ్ రంగంలో వాట్సాప్ ద్వారా ఇలాంటి సేవలు అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ఐసీఐసీఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను గతంలో అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారుల నుండి మంచి స్పందన రావడంతో తాజా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది.

రిటైల్ కస్టమర్లు వాట్సాప్ ద్వారా ఫిక్స్ డ్ డిపాజిట్ అకౌంట్ తెరుచుకోవచ్చు. దీంతో పాటు కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, మొబైల్ బిల్లులు ఒక్క క్లిక్ ద్వారా చెల్లించవచ్చు. త్వరలో మొబైల్ ప్రీపెయిడ్ బిల్లులు చెల్లించే వెసులుబాటు కూడా తీసుకురానున్నది. గతంలో ఐసీఐసీఐ అందుబాటులోకి తెచ్చిన సేవల ప్రకారం ఖాతాదారుడు అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, క్రెడిట్ కార్డు లిమిట్, ప్రీ-అప్రూవ్డ్ లోన్ వివరాలు, క్రెడిట్ కార్డుు, డెబిట్ కార్డుల బ్లాక్ చేయడం, అన్ బ్లాక్ చేయడం వంటి సేవలు పొందే వీలు ఉం టుంది. కార్పోరేట్ కంపెనీలు, ఎంఎస్ఎంఈ కస్టమర్ ఐడీ, దిగుమతి ఎగుమతి కోడ్, బ్యాంకులో రుణ సదుపాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. తాజా సేవలతో కలిపి ఐసీఐసీఐ వాట్సాప్ ద్వారా 25రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.