గురువారం 16 జూలై 2020
National - Jun 24, 2020 , 10:07:49

రూ.1.32 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

రూ.1.32 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

అహ్మదాబాద్‌ : గడిచిన వారం రోజుల్లో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌(ఐసీజీ) సిబ్బంది 88 ప్యాకెట్ల గంజాయి పౌడర్‌ను పట్టుకుంది. దీని విలువ రూ.1.32 కోట్లు. తీర ప్రాంత భద్రత నిమిత్తం ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ఇటీవలే హోవర్‌క్రాఫ్ట్‌ స్కాడ్రన్‌ను, రబ్బరు బోట్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్కాడ్రన్‌ మంచి ఫలితాలను చూపిస్తోంది. ఈ నెల 17, 21, 22వ తేదీల్లో కోస్ట్‌ గార్డ్స్‌ 4, 34, 50 గంజాయి పౌడర్‌ ప్యాకెట్లను కనుగొన్నారు. కుచ్‌ జిల్లాలోని జఖౌ పోర్టు తీరంలోని జనావాసాలు లేని ద్వీపాల్లో వీటిని కనుగొన్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మెరైన్‌ పోలీసులకు గంజాయిని అప్పగించారు. గడిచిన ఆదివారం సైతం సెక్యూరిటీ ఏజెన్సీస్‌, కుచ్‌ మెరైన్‌ పోలీసులు 300 ప్యాకెట్ల గంజాయి పౌడర్‌ను పట్టుకున్నారు. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఆపరేషన్‌గా నిలిచింది.
logo