సోమవారం 06 జూలై 2020
National - Jun 23, 2020 , 14:49:04

డాక్ట‌ర్లు ప‌డే క‌ష్టానికి ఇదే నిద‌ర్శ‌నం

డాక్ట‌ర్లు ప‌డే క‌ష్టానికి ఇదే నిద‌ర్శ‌నం

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో డాక్ట‌ర్లు, పోలీసులు, కార్మికులు ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు. మిగిలిన వారికి కాస్త విశ్రాంతి దొరికినా డాక్ట‌ర్లు మాత్రం ఒకసారి ఐసోలేష‌న్ లోప‌ల అడుగు పెడితే 10 గంట‌ల పాటు పీపీఈ కిట్లు ధ‌రించి ఉండాల్సిందే. చేతులు, శ‌రీరాన్ని క‌వ‌ర్ చేసే విధంగా ఇవి ఉంటాయి. ఇక ఐసోలేష‌న్ నుంచి బ‌య‌టికి వ‌స్తే గాని పీపీఈ కిట్ తీయ‌డానికి వీలు లేదు.

10 గంట‌ల త‌ర్వాత చేతి గ్లౌజులు తీసి చూస్తే ఇదిగో ఇలా ముడత‌లు ముడ‌త‌లుగా త‌యార‌వుతుంది. ఈ చిత్రాన్ని ఛ‌త్తీష్‌ఘ‌డ్‌లోని కేడ‌ర్‌ 2009 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి ఐఏఎస్ ఆఫీస‌ర్ అవ‌నీష్ శ‌ర‌ణ్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. 'ఫ్రంట్‌లైన్ హీరోల‌కు వంద‌నం' అనే క్యాప్ష‌న్ జోడించారు అవ‌నీష్‌. ఇప్పుడు ఈ చిత్రం నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. logo